close

తాజా వార్తలు

Updated : 20/01/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ చిరుత కలవరం

జల్‌పల్లి కార్గో రోడ్డులో గుర్తించిన పోలీసులు

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధి మామిడిపల్లి, జల్‌పల్లి పురపాలిక కార్గోరోడ్డులో చిరుత సంచరిస్తున్నట్లు పహాడీషరీఫ్‌ పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ దూకుతూ చిరుత కనిపించింది. పోలీసులు అదే మార్గం గుండా జల్‌పల్లి కార్గోరోడ్డుకు రాగా.. అక్కడి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు వారు గుర్తించారు. వెంటనే సీఐ విష్ణువర్ధన్‌రెడ్డికి, జల్‌పల్లి ఫారెస్ట్‌ అధికారులను సమాచారం ఇచ్చారు. స్థానికులను పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తం చేశారు. గతేడాది రాజేంద్రనగర్‌లో ఆరునెలల పాటు సంచరించి అటవీశాఖ అధికారులకు పట్టుబడిన చిరుత సైతం జల్‌పల్లి మాదన్నగూడ మీదుగానే వెళ్లిందని నిర్ధారించారు. రెండురోజుల క్రితం శంషాబాద్‌ విమానాశ్రయం గోడదూకి వచ్చిన చిరుత, జల్‌పల్లి కార్గొరోడ్డు మీదుగా వెళ్లిన చిరుత ఒకటేనా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని