close

తాజా వార్తలు

Updated : 20/01/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ జంట ఆత్మహత్య

తలమడుగు, న్యూస్‌టుడే: ఆ యువతి, యువకుడి కుటుంబాలు గ్రామంలో పక్కపక్కనే ఉంటాయి. ఈ క్రమంలో ఏళ్లుగా వారి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. తమ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరిస్తారో లేదోననే భయం వారిని వేధించింది. కలిసి జీవించలేమని నిర్ణయానికి వచ్చిన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం దేగామలో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై దివ్యభారతి తెలిపిన వివరాల ప్రకారం.. దేగామకు చెందిన గోడం శ్రీరామ్‌(25).. గెడం సుజాత(19) కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. శ్రీరామ్‌ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. సుజాత ఇంటర్‌ పూర్తి చేసి పారామెడికల్‌(డీఎల్‌ఏం) కోర్సు చేసింది. వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నా విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు. చెబితే ఒప్పుకుంటారో లేదోనని ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఓ పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరినీ కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోనే శ్రీరామ్‌ మరణించాడు. సుజాత చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని