close

తాజా వార్తలు

Updated : 20/01/2021 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టోల్‌ప్లాజాలకు సం‘క్రాంతి’!

వారం రోజుల్లో రూ.29.32 కోట్ల పన్ను వసూలు
 గతేడాదితో పోలిస్తే రూ.5.47 కోట్లు అదనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని టోల్‌ప్లాజాలు సంక్రాంతి పండుగ సందర్భంగా కాసులతో గలగలలాడాయి. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలో ఎనిమిది రోజుల వ్యవధిలో రూ.29.32 కోట్ల టోల్‌ ఫీజు వసూలు కావటం గమనార్హం. గతేడాది సంక్రాంతికి ఇదే కాలంలో రూ.23.85 కోట్లు వసూలు అయింది. గతేడాదితో పోలిస్తే ఈ దఫా రూ.5.47 కోట్లు అదనంగా వసూలైనట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ రహదారుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వివిధ టోల్‌ప్లాజాల వద్ద 81.59 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారా పన్ను చెల్లించారు. పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులు నడిపినా.. కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌-బెంగళూరు మినహా తెలంగాణ నుంచి వెళ్లే ఇతర జాతీయ రహదారుల్లో పండగ సందర్భంగా వారం రోజుల వ్యవధిలో 20,55,800 వాహనాలు రాకపోకలు సాగిస్తే.. హైదరాబాద్‌-విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలోనే 12,38,942 వాహనాలు రాకపోకలు సాగించాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి నిర్వహణ వ్యవహారాలను కర్ణాటక విభాగం జాతీయ రహదారుల సంస్థ పర్యవేక్షిస్తుంది.




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని