close

తాజా వార్తలు

Updated : 21/01/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ముఖ్యమంత్రి అయితే తప్పేముందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం పదవికి ఆయన అన్ని విధాలా సమర్థుడని చెప్పారు. కేటీఆర్‌ను సీఎంను చేయడానికి తగిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో జరిగిన సమావేశానికి హాజరైన మంత్రిని కేటీఆర్‌ సీఎం అవుతారనే ప్రచారం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ సీఎం ఎప్పుడు అవుతారని మంత్రి మహమూద్‌ అలీని విలేకరులు ప్రశ్నించగా దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ఆయనకు అర్హతలన్నీ ఉన్నాయి
మంత్రి కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని తెరాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డిలు అన్నారు. ఇది తెరాస వ్యవహారమని, దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధవారం వారు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని