close

తాజా వార్తలు

Updated : 21/01/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ!

పోలీసులతో కిడ్నాప్‌ కేసు నిందితుల వెల్లడి

ఈనాడు,హైదరాబాద్‌: ‘‘అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ చేశాం. సిమ్‌కార్డులు కొన్నాం. గుంటూరు శ్రీను స్నేహితులంటూ విజయవాడ నుంచి వచ్చిన వారికి కూకట్‌పల్లిలోని ఓ లాడ్జిలో గదులు తీసిచ్చాం. మేడం చెప్పడంతో చెన్నయ్యతో కలిసి బైక్‌పై ప్రవీణ్‌రావు సోదరుల ఇంటి వద్దకు నాలుగైదు సార్లు వెళ్లాం’’ అంటూ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో నిందితులు బోయ సంపత్‌కుమార్‌, మల్లికార్జునరెడ్డిలు బోయిన్‌పల్లి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉంటున్న వీరిద్దరినీ కోర్టు అనుమతితో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్‌ ఠాణాకు తీసుకువచ్చి ఈ వ్యవహారంపై పలు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి అఖిలప్రియ సూత్రధారిగా వ్యవహరించారని, మిగిలిన విషయాలు తమకు తెలీదంటూ వారు వివరించినట్టు సమాచారం. వీరిని గురువారం మరింత లోతుగా విచారించాలని పోలీస్‌ అధికారులు నిర్ణయించారు.
నేడు ఘటనా స్థలానికి నిందితులు
ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేసిన తీరును తెలుసుకునే క్రమంలో గురువారం నిందితులను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ చేయనున్నారు. బాధితులను ఏ కారులో తీసుకెళ్లారు? మధ్యలో ఎక్కడైనా విరామం తీసుకున్నారా? వారితో సంతకాలు చేయించుకునేందుకు ఎలా బెదిరించారు? అన్న అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో వీరి పాత్రతోపాటు ఇతర నిందితులకు వీరు ఏ విధంగా సహకరించారన్న అంశంపైనే విచారణ చేయనున్నామని పోలీస్‌ అధికారి ఒకరు వివరించారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని