close

తాజా వార్తలు

Published : 26/02/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లల ఆకలి తీర్చకుండానే తిరిగిరాని లోకాలకు..

మద్యం మత్తులో గొడ్డలితో భార్యపై వేటు


స్వప్న

శంషాబాద్‌, న్యూస్‌టుడే: మద్యం తాగి తూగుతూ ఇంటికొచ్చాడు. మళ్లీ మద్యం కోసం డబ్బు ఇవ్వాలని భార్యను కోరాడు. లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. ఆకలితో ఉన్న ముగ్గురు పిల్లలకు భోజనం సిద్ధం చేస్తున్న భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన శంషాబాద్‌ మండల పరిధి ఇంద్రానగర్‌లో గురువారం చోటుచేసుకుంది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కావలి సురేశ్‌, స్వప్న(25)ను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దినసరి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఆరు నెలల బాబుతో సహా మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేశ్‌ మద్యానికి బానిసయ్యాడు. పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని గొడ్డలితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని