close

తాజా వార్తలు

Updated : 26/02/2021 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాఫిక్‌ పోలీసు, సీఐపై దాడి


మేసమ్‌ దర్విష్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: శబ్ద కాలుష్యం చేస్తూ వస్తున్నందుకు అడ్డుకున్నారని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిపైనే ఓ ద్విచక్ర వాహనదారుడు దాడికి పాల్పడిన వైనమిది. జూబ్లీహిల్స్‌ పోలీసులు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1లో టీవీ5 కార్యాలయం మీది నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు టీఎస్‌ 07ఈఎక్స్‌ 0906 బైకుపై ఓ వ్యక్తి మితిమీరిన శబ్దంతో వస్తున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సీఐ ఆ వాహనాన్ని నిలపాల్సిందిగా హోంగార్డు రాథోడ్‌కు సూచించారు. నిలిపేందుకు యత్నించగా, వాహనదారుడు రెచ్చిపోయాడు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. నిలువరించేందుకు సీఐ వెళ్లగా ఆయన్నీ నెట్టేసి దాడికి దిగాడు. ఇతర వాహనదారులు, ట్రాఫిక్‌ పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. అక్కడికి వచ్చిన తన స్నేహితులతో కలిసి నానా హంగామా సృష్టించాడు. ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ ఠాణాలో అప్పగించారు. నిందితుణ్ని మాసబ్‌ట్యాంక్‌ శ్రీనగర్‌కాలనీలో మెట్రో పొలైట్‌ కేఫ్‌ నిర్వహించే మేసమ్‌ దర్విష్‌గా గుర్తించి అరెస్టు చేశారు. దర్విష్‌, అతడి స్నేహితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని