close

తాజా వార్తలు

Published : 26/02/2021 08:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తానొచ్చేనా.. కన్నీరింకేనా!

యువకుడి దుర్మరణంతో దేవరాపల్లి శోకసంద్రం
అనిల్‌కుమార్‌ (పాత చిత్రం)
 
ఇంటి నుంచి వెళ్తూ రెండేళ్ల కుమారుడ్ని ముద్దాడాడు.. ఐదు నెలల గర్భిణి అయిన భార్యకు జాగ్రత్తలు చెప్పాడు.. రాత్రికి ఇంటికి వస్తాడనుకుని ఎదురుచూస్తున్నారు.. తీరా పిడుగులాంటి వార్త చెవిన పడింది.. ఎప్పటికీ తిరిగి రాడని.. ఈ లోకంలోనే లేడని.. ఇక ఆ భార్య, తల్లి రోదనలకు అంతే లేకుండా పోయింది..

దేవరాపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన వైనం ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చోడవరానికి చెందిన అనిల్‌కుమార్‌, రావికమతానికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. జీవనోపాధి నిమిత్తం దేవరాపల్లిలో నివాసం ఉంటూ చేపల వ్యాపారం చేస్తున్నారు. తుని సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిల్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌కు తరలిస్తుండగా మరణించాడు. వ్యాపారం నిమిత్తం వ్యాను కొనుగోలు చేసిన అనిల్‌కుమార్‌ తానే నడుపుతూ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్తుంటాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రైవాడ గ్రామం నుంచి కొంతమంది కూలీలను వ్యానులో ఎక్కించుకుని తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరాడు. ఇంటి నుంచి వచ్చే ముందు గురువారం మధ్యాహ్నానికి తిరిగి వస్తానని భార్యకు చెప్పాడు. చోడవరంలో ఉంటున్న అక్కాచెల్లెలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. రాత్రి 12 గంటల సమయంలో తుని వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ అనిల్‌కుమార్‌ను ఆపారు. పోలీసులకు రికార్డులు చూపి తిరిగి వ్యాను వద్దకు వస్తుండగా.. విశాఖ వైపు వేగంగా వస్తున్న వాహనం బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని అదే వాహనంలో కేజీహెచ్‌కి తీసుకురాగా.. అప్పటికే ప్రాణాలు పోయాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనిల్‌కుమార్‌ స్వగ్రామం చోడవరం కావడంతో అందరూ అక్కడకు వెళ్లారు.

విలపిస్తున్న భార్య, తల్లి

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని