close

తాజా వార్తలు

Updated : 28/02/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తప్పతాగేసి.. తోచినట్లు తోలేసి..

వేర్వేరు ఘటనల్లో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

పోలీసుస్టేషన్‌లో యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌

మద్యం తాగడమే కాకుండా, ఇష్టానుసారం కార్లను తోలడంతో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. నిందితుల్లో ఒకరు యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌.
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. వరుసగా రెండు కార్లతోపాటు మరో ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టాడు. ఓ ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డాడు. జూబ్లీహిల్స్‌ ఎస్సై నవీన్‌రెడ్డి కథనం ప్రకారం.. యూట్యూబ్‌ స్టార్‌గా పేరున్న షణ్ముఖ్‌ శనివారం మధ్యాహ్నం కారులో వెళుతూ జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఉడ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ సమీపంలో ఒక్కసారిగా వేగం పెంచాడు. ముందున్న రెండు కార్లను ఢీకొన్నాడు. పెద శబ్దం చేస్తూ మరో ద్విచక్ర వాహనదారుణ్ని ఢీకొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి, కారును అడ్డగించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకొని, జూబ్లీహిల్స్‌ ఠాణాకు తరలించి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. అతని రక్తంలో మద్యం మోతాదు శాతం 170 ఎంఎల్‌ ఉన్నట్లు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో షణ్ముఖ్‌ స్నేహితుడు ఉన్నాడు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని