
తాజా వార్తలు
మూడు కాళ్ల శిశువు జననం
నూజివీడు, న్యూస్టుడే: నూజివీడు ఏరియా ఆస్పత్రిలో గురువారం మూడు కాళ్ల ఆడ శిశువు జన్మించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రసింగ్ కథనం ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివానిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ, మోహనరావులది మేనరిక సంబంధం. జన్యు లోపం కారణంగా శిశువు ఇలా జన్మించిందని, బిడ్డ ఆరోగ్యంగా ఉందని, వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని సూపరింటెండెంట్ తెలిపారు.
Tags :