close

తాజా వార్తలు

Updated : 05/03/2021 08:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మద్యం మత్తు.. స్నేహమూ చిత్తు

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: మద్యం మత్తు ఎంతటి దురాఘతాలకైనా దారి తీస్తుందనేందుకు ఇదో నిదర్శనం. ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం తాగుతుండగా తలెత్తిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఈ దుర్ఘటన త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో గురువారం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం సీఐ దేవ ప్రభాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లేళ్లపల్లికి చెందిన డి.నాసర్‌రెడ్డి(30), యర్రగొండపాలెం మండలం వీరాయిపాలేనికి చెందిన తిరుపాలు స్నేహితులు. వీరిద్దరూ గురవారం మధ్యాహ్న సమయంలో మిట్టపాలెంలో మద్యం తాగుతున్నారు. ఈ సమయంలో ఘర్షణ తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న తిరుపాలు విచక్షణ కోల్పోయాడు. సమీపంలో ఉన్న మంచం పట్టెతో నాసర్‌రెడ్డి తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఐ దేవ ప్రభాకర్‌, ఎస్సై వెంకట కృష్ణయ్యతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన నాసర్‌రెడ్డి త్రిపురాంతకంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ చోరీ కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని