close

తాజా వార్తలు

Updated : 06/03/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెత్తకుప్పలో ఆడ శిశువు

కాటేదాన్‌, న్యూస్‌టుడే: తన కడుపులో పెరుగుతున్నది ఓ ఆడశిశువని భావించిందో.. మరేదైనా బలమైన కారణం ఉందో..గర్భశ్రావం చేయించుకుని చెత్తకుప్పలో పడేసింది ఓ తల్లి. మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో ఇది చోటుచేసుకుంది. ఎస్సై నారాయణసింగ్‌ కథనం ప్రకారం... మధుబన్‌ శివారు జల్‌పల్లి మార్గంలోని ఎర్రకుంట చెరువు ఒడ్డున చెత్తకుప్పలో శిశువు పడి వుండటంతో వీధి కుక్కలు దాడిచేశాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అబార్షన్‌ చేసి శిశువును బయట పడేసినట్లు గుర్తించారు. అప్పటికే బిడ్డ మృతి చెందడంతో ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని