close

తాజా వార్తలు

Updated : 06/03/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైల్వేలో ఇంటి దొంగలెవరు?

కూపీ లాగుతున్న సైబరాబాద్‌ పోలీసులు

ఓ బాధితుడికి నిందితులు ఇచ్చిన నకిలీ ఐడీ కార్డు

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేలో ఇంటి దొంగల కోసం సైబరాబాద్‌ పోలీసులు వేట మొదలు పెట్టారు. రూ.5.5 లక్షలు చెల్లిస్తే రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ వందలాది మందికి టోపీ పెట్టిన ముఠా గుట్టును గురువారం రట్టు చేసిన విషయం విదితమే. అరెస్ట్‌ చేసిన ఇద్దర్నీ విచారించగా పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. రైల్వే ఉద్యోగుల సహకారంతోనే మోసాలకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు చిక్కితే, సహకరించిన రైల్వే ఉద్యోగులు ఎవరు? బాధితులెవరు అనేది తెలిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక బృందాన్ని కోల్‌కతా, దిల్లీకి పంపించనున్నారు.
అక్కడ అన్యులకు వైద్య పరీక్షలు ఎలా చేశారు
సాధారణంగా రైల్వే ఆసుపత్రుల్లో ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. కానీ నిందితులు, ముందుగా రూ.50వేలు చెల్లించిన వారికి దిల్లీకి తీసుకెళ్లి రైల్వే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. పహాడ్‌గంజ్‌(దిల్లీ), ఖరగ్‌పూర్‌ డీఆర్‌ఎం కార్యాలయాలకు బాధితులను రప్పించి.. అక్కడే ఐరిస్‌, వేలి ముద్రలను సేకరించారు. అక్కడే ఆఫర్‌ లెటర్లు ఇచ్చారు. ఈ దవాఖానాపైనా, డీఆర్‌ఎం కార్యాలయాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఠాకు అక్కడి ఉద్యోగుల్లో ఎవరు సహకరించారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  
ఆ నిపుణులెవరు..?
పశ్చిమబËంగ, దిల్లీలో ‘రైల్వే ప్రాంతీయ శిక్షణా కేంద్రం’ పేరిట భవనాలకు బోర్డులు ఏర్పాటు చేసి బాధితులకు నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆ నిపుణులు రైల్వే ఉద్యోగులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారైతేనే ఆతరహా శిక్షణ ఇస్తారని నిర్ధారణకొచ్చారు. నిందితులు ఇచ్చిన ఐడీ కార్డులు, ధ్రువ పత్రాలను అచ్చం రైల్వే వారు ఇస్తున్న మాదిరిగానే ఉండటంతో అవాక్కయ్యారు. అలా ఎలా తయారు చేయగలిగారు..? ఈ ముఠాకు సహకరించిన ఉద్యోగులెవరో కూపీ లాగుతున్నారు.
అబ్దుల్‌ మాజిద్‌ కూడా బాధితుడే
ఈ మోసంలో సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన దిల్లీకి చెందిన ప్రధాన నిందితుడు సర్వేష్‌ సాహూ అలియాస్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌, విజయవాడకు చెందిన అబ్దుల్‌ మాజిద్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ల్లో శ్రీనివాస్‌ కూడా ఇలా మోసపోయిన వాడే. తన డబ్బు తిరిగి రాబట్టుకునేందుకు నిరుద్యోగులను మా వద్దకు పంపాలంటూ సర్వేష్‌ సాహూ సూచించడంతో ముఠాతో జతకలిశాడు. బాధితుల్లో ఇప్పటి వరకు సైబరాబాద్‌లో ఇద్దరు, రాచకొండలో ఒకరు మాత్రమే ఫిర్యాదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని