
తాజా వార్తలు
అయ్యో పాపం.. వదిలేశారు..!
చిన్నారిని కాకినాడ శిశు సంక్షేమ వసతి గృహ నిర్వాహకులకు అప్పగిస్తున్న చైల్డ్‌లైన్ సభ్యులు
రాజమహేంద్రవరం నేరవార్తలు: అభం శుభం తెలియని ఓ చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు చర్చిలో వదలివేసిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న చర్చిలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు మూడు నెలల వయసు కలిగిన ఓ చిన్నారి ఏడుపులు వినిపించాయి. చిన్నారి ఒంటరిగా ఉండడంతో చర్చి నిర్వాహకులు చేరదీశారు. సాయంత్రం వరకూ ఎవరూ రాకపోవడంతో చైల్డ్ లైన్ సమన్వయకర్త శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు మూడో పట్టణ పోలీసులు సూచనలతో ఆ చిన్నారిని కాకినాడలోని శిశు సంక్షేమ వసతి గృహానికి అప్పగించారు.
Tags :