close

తాజా వార్తలు

Updated : 08/03/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లికానుకగా జోడెడ్ల బండి

న్యూస్‌టుడే, జైనూర్‌

ఎడ్లు, ఎడ్లబండిని కానుకగా అందుకుంటున్న వరుడు

సాధారణంగా పెళ్లి కట్నం (కానుక) అనగానే నచ్చిన వాహనమో..అడిగినంత డబ్బులు ఇవ్వడమో పరిపాటి. ఇందుకు భిన్నంగా ఆదివాసీల సంప్రదాయాలు ముందుచూపుతో కూడుకుని ఉంటాయి. పెళ్లిలో వరుడికి కానుకగా ఎడ్లు, ఎడ్లబండి ఇచ్చిన ఘటన కుమురం భీం జిల్లా జైనూర్‌ మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకుంది. వివరాలిలా.. మండల కేంద్రంలోని కాశీపటేల్‌గూడాకు చెందిన మెస్రం శేకు తనయుడు నగేష్‌కు నార్నూర్‌ మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన సూర్యారావు కూతురు రేణుకాతో శుక్రవారం వివాహం చేశారు. నగేష్‌ పెద్దగా చదువుకోలేదు. తన అల్లుడి వ్యవసాయ పనుల అవసరాలకు ఉపయోగపడుతుందని భావించి ఎడ్ల బండి జతను పెళ్లి కానుకగా బహుకరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని