close

తాజా వార్తలు

Updated : 05/05/2021 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ వైన్‌ బాటిల్‌ ధర రూ. 7.37 కోట్లు!

రోదసిలో పులియబెట్టిన పానీయం వేలానికి..

లండన్‌: అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్‌. దాని ధర కూడా అందనంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఏడాదికిపైగా గడిపిన ఒక ఫ్రెంచ్‌ వైన్‌ బాటిల్‌ను క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37 కోట్లు) పలకొచ్చని భావిస్తోంది. ఈ సీసా పేరు ‘పెట్రస్‌ 2000’. 2019 నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్‌ సీసాల్లో ఇది ఒకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది. వీటికి ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు రుచి పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని చెప్పారు. రోదసిలోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందన్నారు. శూన్య గురుత్వాకర్షణతో కూడిన ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చిందని క్రిస్టీస్‌ వైన్‌ అండ్‌ స్పిరిట్స్‌ విభాగం డైరెక్టర్‌ టిమ్‌ టిప్‌ట్రీ చెప్పారు. దీంతో ఈ సీసా ధర పెరిగిపోయిందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని