దక్షిణ భారత్‌లో తొలి టైగర్‌షార్క్స్‌ స్క్వాడ్రన్‌
close

తాజా వార్తలు

Updated : 21/01/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణ భారత్‌లో తొలి టైగర్‌షార్క్స్‌ స్క్వాడ్రన్‌

తంజావూరు: దక్షిణ భారత్‌లో తొలి 222 టైగర్‌షార్క్స్‌ స్క్వాడ్రన్‌ని వాయుసేన ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానాన్ని తంజావూరు వైమానిక స్థావరంలో చేర్చారు. బ్రహ్మోస్‌ క్షిపణిని మోయగలిగేలా తీర్చిదిద్దిన ఈ విమానానికి వాటర్‌ కేనన్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, వాయుసేనాధిపతి ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌.బధౌరియా పాల్గొన్నారు. ఈ యుద్ధ విమానం వాయుసేనతో పాటు నావికా దళానికీ సేవలందించే అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణుల్ని మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి 300 కి.మీ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు. వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ హిందూ మహా సముద్ర ప్రాంతం(ఐఓఆర్‌)లో భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. తొలుత ఆరు యుద్ధ విమానాల్ని స్క్వాడ్రన్‌లో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న వాయుసేన అనంతరం ఈ సంఖ్యను 18కి పెంచనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని