close

తాజా వార్తలు

Published : 02/02/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిరసనలకు అనుమతి లేదు: జామియా వర్శిటీ

దిల్లీ: దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ అధికారులు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వర్శిటీ ప్రాంగణంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు తావు ఉండకూడదని ఓ ప్రకటనలో వెల్లడించారు. వర్శిటీ ప్రాంగణంలో విద్యార్థుల చదువుకు, శాంతికి భంగం కలిగించే ఎలాంటి నిరసన సమావేశాలు, ప్రసంగాలు, బహిరంగ సమావేశాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కోసం విద్యార్థులంతా క్రమశిక్షణతో యాజమాన్యానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎవరైనా బయటి వ్యక్తులు వర్శిటీలోకి వస్తే వెంటనే తెలియజేయాలని వెల్లడించారు. ఇటీవల మహాత్మాగాంధీ వర్ధంతి రోజున జామియా వర్శిటీ విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని