ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత JKలో తొలిసారి..
close

తాజా వార్తలు

Published : 13/02/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత JKలో తొలిసారి..

శ్రీనగర్‌: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. గతేడాది ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖాళీగా ఉన్న దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చి 5వ తేదీ నుంచి 20 మధ్య 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జమ్మూకశ్మీర్‌ ఎన్నికల అధికారి షైలేంద్ర కుమార్‌ తెలిపారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ను ప్రకంటించిన తర్వాత జీసీ మర్మును అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో అక్కడ పాలనంతా కేంద్రం పర్యవేక్షణలో సాగుతోంది. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికలను అక్కడి ప్రధాన పార్టీలైన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) బహిష్కరించాయి. దీంతో దాదాపు 12,500 పంచాయతీ స్థానాలు అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాయి. తాజా ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఆరు నెలలుగా జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీ నేతలైన ఫరూక్‌ అబ్ధుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మోహబూబా ముఫ్తీ గృహనిర్భంధంలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని