వుహాన్‌కు బయలుదేరిన భారత సైనిక విమానం
close

తాజా వార్తలు

Published : 26/02/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వుహాన్‌కు బయలుదేరిన భారత సైనిక విమానం

దిల్లీ: కొవిడ్‌తో విలవిల్లాడుతున్న చైనాకు వైద్య సాయం అందించడం కోసం  15 టన్నుల వైద్య పరికరాలు, మందులతో భారత వాయుసేనకు చెందిన విమానం వుహాన్‌ నగరానికి బయలుదేరినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఈ మందులు చైనాకు ఉపయోగపడతాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ విమానంలో దాదాపు 15 టన్నుల వైద్య పరికరాలు మందులు చైనాకు సరఫరా చేశాం. వాటిలో ముఖానికి తొడిగే మాస్కులు, గ్లౌజులు సహా వివిధ రకాల అత్యవసర వైద్య సామగ్రి ఉన్నాయి. చైనాకు భారత్‌ అందిస్తున్న ఈ సాయం రెండు దేశాల ప్రజల మధ్య స్నేహానికి ప్రతీక. అదేవిధంగా సరిగ్గా ఈ సంవత్సరానికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తి కావడం విశేషం. ఇప్పుడు వుహాన్‌ వెళ్లిన విమానం గురువారం 80 మంది భారతీయులు, మరో 40 మంది పక్క దేశాల పౌరులతో వెనుదిరుగుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్‌ విషయమై ఇప్పటికే భారత ప్రధాని మోదీ, ఫిబ్రవరి 8న, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో చైనాకు వైద్య సాయం అందించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. 

కొవిడ్‌ మహమ్మారి కారణంగా చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2,715 మంది మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు. 78వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని