నమస్తేతో స్వాగతం పలికిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు
close

తాజా వార్తలు

Published : 12/03/2020 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమస్తేతో స్వాగతం పలికిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

పారిస్‌(ఫ్రాన్స్‌): కరోనా ప్రభావంతో షేక్‌ హ్యాండ్‌(కరచాలనం) చేయాలంటే సామాన్యులతో పాటు దేశాధినేతలు సైతం జంకుతున్నారు. ఇతరులతో చేతులు కలపడం వల్ల సులువుగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యులు తేల్చారు. దీంతో ప్రపంచమంతా కరచాలనం వద్దు నమస్తే ముద్దు అంటోంది. దీంతో భారతీయ సంస్కృతి కాస్తా విశ్వవ్యాప్తమౌతోంది. తాజాగా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌VI బుధవారం ఫ్రాన్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ నమస్కారం పెట్టి  ఆహ్వానం పలికారు. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్‌ సైతం అవతల వైపు ఉన్న క్వీన్‌ లెటిజియాకు గాలిలో ముద్దు (ఫ్లయింగ్‌ కిస్‌) ద్వారా స్వాగతం పలికింది.

కాగా.. స్పెయిన్‌లో ఇప్పటికే కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2,124కి చేరింది. మరోవైపు ఫ్రాన్స్‌లో 1,784 కేసులు నమోదయ్యాయి. అయితే, ఫ్రాన్స్‌లో ఏకంగా మంత్రికే కరోనా సోకడం గమనార్హం. ప్రస్తుతం ఆ మంత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. కరోనా బయటపడ్డప్పటి నుంచి ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడాన్ని అలవాటు చేసుకుంటోందని, మన దేశంలోనూ ‘నమస్తే’ సంస్కృతిని మరిచిపోయినవాళ్లు మళ్లీ అలవాటు చేసుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ సైతం  సూచించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని