కరోనా: రోజుకూలీలకు యూపీ ఆర్థిక సాయం
close

తాజా వార్తలు

Published : 19/03/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: రోజుకూలీలకు యూపీ ఆర్థిక సాయం

యోగి ప్రభుత్వం నిర్ణయం

లఖ్‌నవూ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేద రోజుకూలీలకు ఆర్థిక సాయం అందజేయాలి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా తీసుకున్న మూసివేత చర్యల వల్ల శ్రామికులు నష్టపోకుండా యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో విధివిధానాలను నిర్ణయించటం కోసం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ముఖ్యమంత్రికి మూడు రోజుల్లో నివేదికను అందచేయనుంది.

‘‘కరోనా నిరోధక చర్యల్లో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మూసివేతను కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంది. అయితే పూట గడిచేందుకు పేదవారు ప్రతిరోజూ శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు శ్రామికుల జీవనోపాధిపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో రోజువారీ శ్రామికులకు కరోనా ప్రభావిత కాలంలో ఆర్థిక సాయాన్ని అందజేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్థిక రాష్ట్ర మంత్రి సురేశ్‌ ఖన్నా నేతృత్వంలో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటయింది. దీనిలో వ్యవసాయ, కార్మిక మంత్రులు ఇతర సభ్యులుగా ఉంటారు. రోజువారీ సంపాదించే పేదల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్టీజీఎస్‌ ద్వారా నిర్ణీత మొత్తాన్ని జమ చేయనున్నాం’’ అని ఓ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని