32 రాష్ట్రాలు/యూటీలు పూర్తి లాక్‌డౌన్‌!
close

తాజా వార్తలు

Updated : 24/03/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

32 రాష్ట్రాలు/యూటీలు పూర్తి లాక్‌డౌన్‌!

దిల్లీ: కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి లాక్‌డౌన్‌ విధించాయని తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 560జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు ఒడిశాలోని 30 జిల్లాల్లో కూడా ఈ అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమలుచేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి లాక్‌డౌన్‌ విధించని యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఆంక్షలు అమలుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవలం సోమవారం ఒక్కరోజే 99 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను పాటించకుండా వాహనాలతో రోడ్లపైకి వస్తున్న వారిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిస్తున్నారు.

ఈనాన్య రాష్ట్రంలో తొలికేసు..

దేశంలో ఇప్పటికే 23రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ తాజాగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. మణిపూర్‌లో 23ఏళ్ల యువకుడికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలికేసు. ఆ యువకుడు ఈ మధ్యే యూకే నుంచి భారత్‌ వచ్చినట్లు గుర్తించారు.

మహారాష్ట్ర, కేరళలో అత్యధిక కేసులు..

దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో సోమవారం నాటికి 87కేసులు నమోదుకాగా మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 97కు చేరుకుంది. కేరళలో 95కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు నలుగురు కోలుకున్నారు.  

కర్ణాటకలో 37.. తెలంగాణలో 33

వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ కర్ణాటకలోనూ విజృంభిస్తోంది. మంగళవారం కొత్తగా నాలుగు కేసులు నిర్ధారణకాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 37కుచేరింది. ఇటు తెలంగాణలోనూ కొవిడ్‌-19 కేసుల సంఖ్య 33కు చేరగా.. వీరిలో పదిమంది విదేశీయులే ఉన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని