యూపీలో 15జిల్లాల మూసివేత
close

తాజా వార్తలు

Updated : 08/04/2020 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో 15జిల్లాల మూసివేత

లఖ్‌నవూ: రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా (హాట్‌స్పాట్స్‌గా ఉన్న 15 జిల్లాలను ఏప్రిల్ 15 వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశించింది. ఈ నిబంధనను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది. యూపీలోని లఖ్‌నవూ, గౌతమ్‌ బుద్ధ నగర్‌, నోయిడా, ఘజియబాద్, మీరట్, ఆగ్రా, షామ్లీ, సహ్రాన్‌పూర్‌, వారణాశి, కాన్పూర్‌, బరేలి, ఫిరోజబాద్, బస్తీ, బులంద్‌షెహర్, మహారాజ్‌గంజ్‌ జిల్లాలను ఏప్రిల్‌ 15 వరకు పూర్తి స్థాయిలో దిగ్బంధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. బుధవారం అర్థరాత్రి నుంచే ఈ నిబంధనను అమలుకానున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశ రాజధాని ప్రాంత పరిధిలోని (ఎన్‌సీఆర్‌) నోయిడాలో కూడా ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల నిత్యావసరాలను ఇంటి వద్దనే సరఫరా చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు జనసాంద్రత ఎక్కువగా ఉండి కరోనా కేసులు నమోదయిన ప్రాంతాలను కరోనా  కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు యూపీలో 326 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతిచెందారు. అలానే 21 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని