విద్యార్థుల కోసం 250 బస్సులు
close

తాజా వార్తలు

Published : 17/04/2020 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యార్థుల కోసం 250 బస్సులు

రాజస్థాన్‌కు పంపిన యూపీ ప్రభుత్వం

కోట (రాజస్థాన్‌): పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వెళ్లి లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు యూపీ చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌లోని కోటలో ఉన్న సుమారు 7500 మంది విద్యార్థులను తీసుకొచ్చేందుకు 250 బస్సులను పంపించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వడం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటకు వెళుతుంటారు. అలా యూపీ నుంచి వెళ్లిన విద్యార్థులు సుమారు 7500 మంది ఉన్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ మూలంగా వారు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఈ క్రమంలో రెండోసారీ లాక్‌డౌన్‌ విధించడంతో వారు #SendUsBackHome పేరిట హ్యాష్‌ట్యాగ్‌తో ఇటీవల సోషల్‌మీడియాలో అభ్యర్థించారు. దీంతో స్పందించిన యూపీ ప్రభుత్వం 250 బస్సులను పంపించింది. శుక్రవారం రాత్రి విద్యార్థులతో ఆ బస్సులు బయల్దేరనున్నాయి. బస్సుకు 30 మందిని చొప్పున విద్యార్థులను ఎక్కించుకోనున్నారు.

విద్యార్థుల తరలింపునకు యూపీ ప్రభుత్వం తీసుకున్న చొరవను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రశంసించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటలో బస్సులు పంపిస్తే బాగుంటుందంటూ ట్వీట్‌ చేశారు. యూపీ ప్రభుత్వ చర్యను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తప్పుబట్టారు. లాక్‌డౌన్‌ స్ఫూర్తికి ఇది విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులను ఆహ్వానించినప్పుడు వలస కూలీలను రాష్ట్రంలోకి రాకుండా ఎలా ఆపగలరని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని