బెయిల్‌ కావాలా.. పీఎం-కేర్స్‌కు విరాళం ఇవ్వు!
close

తాజా వార్తలు

Published : 18/04/2020 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెయిల్‌ కావాలా.. పీఎం-కేర్స్‌కు విరాళం ఇవ్వు!

రాంచీ: పీఎం-కేర్స్‌కు రూ.35వేల విరాళం ఇచ్చి మాజీ ఎంపీతో పాటు మరో ఐదుగురు బెయిల్‌ పొందిన ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. బెయిల్‌ కావాలంటే విరాళం ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి షరతు విధించారు. దీన్ని అంగీకరించిన వారు ఇటు బెయిల్‌ పొందడంతో పాటు.. కరోనాపై పోరులో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపును సైతం అందిపుచ్చుకున్నారు.

భాజపా మాజీ ఎంపీ సోమ్‌ మరండీ సహా మరో ఐదుగురు 2012లో నిర్వహించిన రైల్‌ రోకో కేసులో దోషులుగా తేలారు. దీనిపై విచారణ చేపట్టిన సహిబ్‌గంజ్‌ రైల్వే జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌.. వారు ఒక సంవవత్సరం పాటు సాధారణ జైలు జీవితం గడపాలని శిక్ష ఖరారు చేశారు. దీంతో ఫిబ్రవరి నుంచి వారు జైలు జీవితం గడుపుతున్నారు. 

ఈ క్రమంలో తమకు విధించిన శిక్షను కొట్టివేయాలని కోరుతూ దోషులు ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో కనీసం బెయిలైనా ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అనుభా రావత్‌ చౌదరి.. పీఎం-కేర్స్‌కు రూ.35,000 విరాళం సహా, ఆరోగ్య-సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే బెయిల్‌ ఇస్తామని షరతు విధించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. న్యాయమూర్తి షరతులకు అంగీకరించిన వారు విరాళం ఇచ్చేసి బెయిల్‌ పొందారు. దీంతో జైలు జీవితం నుంచి విముక్తితో పాటు కొవిడ్‌-19పై పోరులో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని