కరోనాను జయించిన 3 నెలల చిన్నారి
close

తాజా వార్తలు

Published : 27/04/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను జయించిన 3 నెలల చిన్నారి

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మూడు నెలల బాలుడు కరోనా వైరస్‌ను జయించాడని అధికారులు తెలిపారు. తల్లి పాలతోనే రోగనిరోధక శక్తి పెంచుకొని మహమ్మారి నుంచి కోలుకున్నాడని పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 12న పరీక్షలు నిర్వహించగా తల్లికి నెగిటివ్‌, చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స సవాలుగా మారింది. అయితే బాలుడికి పాలిచ్చే సమయంలో ఆమెకి గ్లవ్స్‌, మాస్క్‌ ధరించాలని సూచించాం. కరోనా సోకిన తర్వాత చిన్నారికి జ్వరం కాకుండా ఎటువంటి తీవ్ర సమస్యలు రాలేదు. దానికి ముందులు ఇచ్చాం. అయితే ఎటువంటి చికిత్స లేకుండానే తల్లిపాలతో రోగనిరోధక శక్తి పెంచుకొని బయటపడ్డాడు’’ అని బీఆర్‌డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ గణేశ్‌ కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 25, 26న తల్లికి, బిడ్డకి కరోనా పరీక్షలు నిర్వహించామని, నెగిటివ్‌ అని తేలడంతో డిశ్చార్జి చేశామని గణేశ్‌ పేర్కొన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోమని సూచించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని