లాక్‌డౌన్‌ను పొడిగించిన పంజాబ్‌
close

తాజా వార్తలు

Published : 30/04/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ను పొడిగించిన పంజాబ్‌

దిల్లీ: పంజాబ్‌లో మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో పంజాబ్‌లో మే 3వ తేదీ నుంచి మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. ఈ మేరకు సీఎం వీడియో సందేశంలో మాట్లాడుతూ.. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రతిరోజూ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచేందుకు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా వాడాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని