కేరళ: ‘జీతాల్లో కోత’ ఆర్డినెన్స్‌కు ఆమోదం!
close

తాజా వార్తలు

Published : 30/04/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేరళ: ‘జీతాల్లో కోత’ ఆర్డినెన్స్‌కు ఆమోదం!

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించిన కేరళ ప్రభుత్వం వారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఆరు రోజుల చొప్పున ఐదు నెలల పాటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్య హైకోర్టుకు చేరింది.

దీనిపై వాదనలు విన్న కేరళ హైకోర్టు స్టే విధించింది. అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకించాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని గవర్నర్‌ను కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌కు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆదా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కోత కేవలం వాయిదా మాత్రమేనని..ఉద్యోగులకు వీటిని తిరిగి చెల్లిస్తామని కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్‌ ఇసాక్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

భారత్‌లో కరోనా: 33వేల కేసులు, 1074మరణాలు

స్వీడన్‌ రూటే సపరేటు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని