పరీక్షించకుండా వెనక్కి తేవడం ప్రమాదకరం
close

తాజా వార్తలు

Updated : 05/05/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరీక్షించకుండా వెనక్కి తేవడం ప్రమాదకరం

విదేశాల నుంచి భారతీయల తరలింపుపై ప్రధానికి విజయన్‌ లేఖ 

తిరువనంతపురం: కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించకుండా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం ప్రమాదకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ‘‘విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేయకుండా భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. విమానంలో దాదాపు 200 మంది ప్రయాణిస్తారు. వారిలో ఒకరిద్దరికి వైరస్‌ ఉన్నా, అది మిగతా వారికి, దేశానికి ఎంతో ప్రమాదకరం. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను ఇక్కడ పాటించకపోవడం దురదృష్టకరం. వారిని పరీక్షించిన తర్వాతే భారత్‌కు తీసుకురావాలి’’ అని ప్రధానికి రాసిన లేఖలో విజయన్‌ పేర్కొన్నారు. 

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని గురువారం నుంచి వాయు, జల మార్గాల ద్వారా భారత్‌కు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది కేరళ రాష్ట్రానికి చెందినవారు విదేశాల నుంచి వచ్చేందుకు నార్క్‌ (నాన్‌ రెసిడెన్స్‌ కేరలేట్స్‌ అఫైర్స్‌)వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వారందరికి పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బందిని విమానాశ్రయంలో నియమించనున్నట్లు విజయన్‌ తెలిపారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తామని, మిగిలిన వారు ఇళ్లలోనే స్వీయనిర్భందంలో ఉండాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని