ఒకే జిల్లాలో 50మంది వలస కార్మికులకు..
close

తాజా వార్తలు

Updated : 20/05/2020 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే జిల్లాలో 50మంది వలస కార్మికులకు..

లఖ్‌నవూ: లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒకే జిల్లాలో వలస కార్మికులు ఎక్కువ సంఖ్కలో కొవిడ్‌ బారిన పడ్డారు. బస్తీ జిల్లాకు చెందిన 50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 104కి చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 28 మంది కోలుకున్నట్లు వెల్లడించారు.

కొవిడ్‌ సోకిన 50 మంది బాధితులు ఇటీవల మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చినట్లు గుర్తించామని జిల్లా కలెక్టర్‌ నిరంజన్‌ తెలిపారు. వారందరినీ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తుండటంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. జిల్లాకు వస్తున్న వలస కార్మికులను 21 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు బయట పడినవారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని