మధ్యప్రదేశ్‌లో పంట పొలాలపై మిడతల దాడి
close

తాజా వార్తలు

Published : 24/05/2020 22:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌లో పంట పొలాలపై మిడతల దాడి

 ఆందోళనలో స్థానిక రైతులు 

భోపాల్/ఝాన్సీ: కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌లో పంటలను నాశనం చేసిన మిడతల దండు తాజాగా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించింది. ముందుగా వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నియోజకవర్గం బుధ్నిలో గుర్తించారు. దీంతో ఆ ప్రాంత రైతులను రాష్ట్ర వ్యవసాయ విభాగం అధికారులు అప్రమత్తం చేశారు. మిడతలను తరిమి కొట్టేందుకు పెద్దగా శబ్దాలు చేయాలని రైతులకు సూచించారు. అంతేకాకుండా అవి ఏ దిశగా వెళుతున్నాయో గమనించి తమకు సమాచారం అందించాలని కోరారు. ట్రాక్టర్లు, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మిడతల తాకిడి ఉన్న ప్రాంతాల్లో రసాయనాలను పిచికారి చేయనున్నట్లు తెలిపారు. అయితే మిడతలు పెద్ద ఎత్తున రావడంతో  తమ పంట పొలాల గురించి స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత 27 ఏళ్లలో ఇదే అతి పెద్ద మిడతల దాడి అని మధ్యప్రదేశ్‌ వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ మిడతలను నియంత్రించలేకపోతే సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన పెసర పంటకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలనే కాకుండా కూరగాయ పంటలు, పండ్ల తోటలు, నర్సరీలతో పాటు వేల ఎకరాల్లో సాగుచేస్తున్న పత్తి, మిరప పంటలను మిడతలు నాశనం చేసే అవకాశం ఉందని అన్నారు. 

మరోపక్క ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో కూడా మిడతల తాకిడి ఎక్కువగా ఉండటంతో రసాయనాల పిచికారికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆండ్రా వంశీ అగ్రిమాపక సిబ్బందిని ఆదేశించారు. వీటి నియంత్రణ కోసం రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక బృందాలను పిలిపించనున్నట్లు తెలిపారు. స్థానికులు ఎవరైనా తమ ప్రాంతాల్లో మిడతలను గుర్తిస్తే వెంటనే జిల్లా కంట్రోల్‌రూంకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని