వాయుసేన ఒరలోకి ‘ఎగిరే తూటాలు’..! 
close

తాజా వార్తలు

Published : 27/05/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాయుసేన ఒరలోకి ‘ఎగిరే తూటాలు’..! 

న్యూదిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి తేజస్‌ స్క్వాడ్రన్‌ చేరింది. వీటికి వాయుసేన ‘ఫ్లయింగ్‌ బుల్లెట్స్‌’ అని పేరుపెట్టింది. వాయుసేన 18వ స్వ్కాడ్రన్‌ మరోసారి విధుల్లోకి చేరినట్లైంది. ఈ స్క్వాడ్రన్‌ తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద సులుర్‌ స్థావరంలో మోహరించనుంది. దేశీయంగా తయారైన తేజస్‌ విమానాలతో ఏర్పాటు చేసిన రెండో స్క్వాడ్రన్‌ ఇది. దీనిని వాయుసేన చీఫ్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా ప్రారంభించారు. 
దేశీయంగా తయారైన తేజస్‌ నాలుగో తరానికి చెందిన యుద్ధవిమానం. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఫ్లైబై వైర్‌ సాంకేతికతను వినియోగించారు. ఇంటిగ్రేటెడ్‌ ఏవియానిక్స్‌, మల్టీమోడ్‌ రాడార్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగో తరం యద్ధవిమానాల్లో ఇది అత్యంత తేలికైంది. ఈ స్క్వాడ్రన్‌లో ఫైనల్‌ ఆపరేషనల్‌ క్లియర్స్‌ మోడల్‌కు చెందిన 20 విమానాలు ఉంటాయి. వీటిల్లో 4 ట్రైనర్లు, 16 ఫైటర్లు ఉంటాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని