నిబంధనలు ఉల్లంఘన.. ప్రముఖ ఆస్పత్రిపై కేసు
close

తాజా వార్తలు

Published : 06/06/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిబంధనలు ఉల్లంఘన.. ప్రముఖ ఆస్పత్రిపై కేసు

దిల్లీ: కొవిడ్‌-19కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ ఆసుపత్రి సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్యారోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సుమారు 675 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిని జూన్‌ 3న కొవిడ్‌-19 సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ఉత్తర్వులను బేఖాతరు చేసిందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు కేసు నమోదు చేశారు.

కొవిడ్‌-19 పరీక్షలకు ఆర్‌టీ-పీసీఆర్‌ యాప్‌ను వినియోగించకపోవడమే కారణమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించే ల్యాబ్స్‌ తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాల్సి ఉంది. సదరు ఆస్పత్రి ఆ యాప్‌ను వినియోగించకపోవడంతో అంటు వ్యాధుల చట్టం 1897 కింద కొవిడ్‌ -19 నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేశారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ ఈ యాప్‌ను తీసుకురాగా.. దిల్లీ ప్రభుత్వం యాప్‌ వాడకాన్ని తప్పనిసరి చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని