గురుగ్రామ్‌లో మిడతల దండు
close

తాజా వార్తలు

Published : 28/06/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గురుగ్రామ్‌లో మిడతల దండు

రైతులను అప్రమత్తం చేసిన అధికారులు

గురుగ్రామ్‌: పంటలను నాశనం చేసే మిడతల దండు దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చేరుకుంది. శనివారం ఉదయం గురుగ్రామ్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచరిస్తున్న మిడుతలను పలువురు చిత్రీకరించారు. దిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మిడతలు ఇంకా దిల్లీలోకి ప్రవేశించలేదు. మిడతలు ప్రస్తుతం రాజధాని వైపు వెళ్లే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గురుగ్రామ్‌లో మిడతల దాడి పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులకు ప్రభుత్వం పలు సలహాలు అందించనున్నట్లు వెల్లడించారు.

‘ఉదయం 11 గంటలకు మిడుతల సమూహం కనిపించింది. వెంటనే కిటికీలు, తలుపులు మూసివేసుకున్నాము. కీటకాలను తరిమికొట్టడానికి భవనాలపై ఏర్పాటు చేసిన హూటర్లను ప్రారంభించాం’ అని ఎంజీ రోడ్డులో నివాసముండే రీటా శర్మ తెలిపారు. గ్రామాల్లో మిడతలపై అవగాహన కల్పించాల్సిందిగా వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సూచించింది. పురుగు మందుల పిచికారీ కోసం ఉపయోగించే పంపులను సిద్ధం చేసుకోవాలని రైతులను కోరింది. పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తోపాటు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోకి దూసుకుపోతున్న మిడతల సమూహాలు పంటలను నాశనం చేస్తున్నాయి.
 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని