వ్యాక్సిన్‌: భార‌త్‌లో మ‌రో కంపెనీ ముంద‌డుగు!
close

తాజా వార్తలు

Published : 03/07/2020 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌: భార‌త్‌లో మ‌రో కంపెనీ ముంద‌డుగు!

వ్యాక్సిన్ ప్రయోగాల‌కు సిద్ధ‌మైన జైడ‌స్ కాడిలా.. 
డీసీజీఐ అనుమ‌తి పొందిన రెండో కంపెనీ

దిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంటున్న‌‌ కొవిడ్-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో ఫార్మా కంపెనీలు త‌ల‌మున‌క‌లయ్యాయి. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా‌పై మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు డ్ర‌గ్ కంట్రోల‌ర్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా భార‌త్‌కు చెందిన‌ మరో కంపెనీకి డీసీజీఐ అనుమ‌తినిచ్చింది.

కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 17కంపెనీలు ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తున్నాయి. వ్యాక్సిన్లు, ఔష‌ధాల త‌యారీకి కేంద్ర‌మైన భార‌త్ కూడా ఈ రేసులో ముందుందనే చెప్ప‌వ‌చ్చు. భార‌త్ బ‌యోటెక్‌కు ఇప్ప‌టికే మాన‌వ ప్ర‌యోగాల‌కు అనుమ‌తి అభించ‌గా తాజాగా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన జైడ‌స్ కాడిలా హెల్త్‌కేర్ రూపొందించిన వ్యాక్సిన్ డీసీజీఐ అనుమ‌తి పొందింది. దేశంలో డీసీజీఐ అనుమ‌తి పొందిన రెండో వ్యాక్సిన్ ఇదే. తాజా అనుమ‌తితో జైడ‌స్ కాడిలా మొద‌టి, రెండు ద‌శల్లో మాన‌వుల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించ‌నుంది. మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో అత్య‌యిక స్థితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కొవిడ్‌19పై వేసిన నిపుణుల క‌మిటీ ఇచ్చిన సిఫార్సుల మేర‌కు ప్ర‌భుత్వం వేగంగా అనుమ‌తులిస్తోన్న విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే, ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌లో ఆస్ట్రాజెనికా, మోడెర్నా కంపెనీలు వ్యాక్సిన్ రూపొందించ‌డం‌లో ముందున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఈమ‌‌ధ్యే ప్ర‌క‌టించింది. మోడెర్నా రూపొందించిన వ్యాక్సిన్ ఈ నెలలో మూడోద‌శ ప్ర‌యోగాలు ప్రారంభించేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారుచేసిన వ్యాక్సిన్ కూడా ప్ర‌యోగ ద‌శ‌ల్లో ముందుంది. ఇక జ‌ర్మనీకి చెందిన బ‌యోఎన్‌టెక్‌, ఫైజ‌ర్ క‌లిసి రూపొందించిన వ్యాక్సిన్ స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కొవిడ్‌ వ్యాక్సిన్ త‌యారీలో చైనా కంపెనీలు కూడా ముందున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని