క్వారంటైన్‌లో ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి..!
close

తాజా వార్తలు

Published : 08/07/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్వారంటైన్‌లో ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి..!

రాంచీ: ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లారు. త‌న స‌హ‌చ‌ర మంత్రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో హేమంత్ సోరెన్ క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. దీంతో ముఖ్య‌మంత్రి అధికార నివాసానికి రాక‌పోక‌ల‌ను నిషేధించారు. రాష్ట్రమంత్రి మిథిలేశ్‌ ఠాకూర్‌కు కొవిడ్-‌19 నిర్ధార‌ణ అయ్యింది. మంత్రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కముందు ముఖ్య‌మంత్రితో క‌ల‌వ‌డంతో సీఎం సోరెన్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్య‌మంత్రి కార్యాల‌య సిబ్బందిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని సీఎం సూచించారు.  నేడు ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌కు క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష చేసే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే, ఝార్ఖండ్‌లో క‌రోనా వైర‌స్ అదుపు‌లోనే ఉన్న‌ట్లు రాష్ట్రప్ర‌భుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌రకు 3000పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 22మంది మృత్యువాత‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 872 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవీ చ‌ద‌వండి..
భార‌త్‌: వారంలో ల‌క్షా 60వేల కేసులు, 3242మ‌ర‌ణాలు
2021నాటికి 25కోట్ల మందికి క‌రోనా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని