టిక్‌టాక్‌పై నిషేధాన్ని ప‌రిశీలిస్తున్నాం: ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 08/07/2020 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌పై నిషేధాన్ని ప‌రిశీలిస్తున్నాం: ట్రంప్‌

చైనాపై ప్ర‌తీకార చ‌ర్య‌లో భాగ‌మేన‌న్న అధ్య‌క్షుడు

వాషింగ్ట‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి కార‌ణ‌మైన చైనా తీరుపై అగ్ర‌రాజ్యం అమెరికా ఇప్ప‌టికే గుర్రుగా ఉంది. ప్ర‌పంచాన్ని వంచించిన చైనాపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తోన్న అమెరికా, టిక్‌టాక్ యాప్ నిషేధాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు అమెరికా విదేశాంగమంత్రి ఇప్ప‌టికే సంకేతాలిచ్చారు. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్‌టాక్ నిషేధంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. తాజాగా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ స్పందించారు. 'అదొక పెద్ద వ్యాపారం. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతుందో తెలుసు. అమెరికాతోపాటు ప్ర‌పంచానికి చైనా చేసిన ప‌ని ఎంతో అవమాన‌క‌ర‌మైంది. ఈ స‌మ‌యంలో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించే విష‌యాన్ని త‌మ ప‌రిపాల‌నావిభాగం ప‌రిశీలిస్తోంది. చైనాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంలో చాలా మార్గాల్లో ఇదొక‌టి' అని ట్రంప్‌ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచంలో కోటి మందికిపైగా సోకిన ఈ వైర‌స్ ఇప్ప‌టికే ఐదున్న‌ర ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. ఈ సంద‌ర్భంలో ప్ర‌పంచాన్నే సంక్షోభంలోకి నెట్టేసిన క‌రోనా వైర‌స్‌పై చైనా అనుస‌రిస్తున్న తీరును అమెరికా అధ్య‌క్షుడు తొలినుంచి ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. జ‌వాబుదారీత‌నం లేని చైనా త‌న వంచ‌న విధానంతో ప్ర‌పంచాన్నే ముంచింద‌ని ప‌లుసార్లు విమ‌ర్ళించారు. 

ఇదిలాఉంటే, చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు దాదాపు 59యాప్‌ల‌ను భార‌త్ నిషేధించిన అనంత‌రం అమెరికా కూడా వాటి నిషేదాన్ని ప‌రిశీలిస్తోంది.

ఇవీ చ‌ద‌వండి..
విదేశీ విద్యార్థుల‌కు అమెరికా భారీ షాక్‌..!
చైనా వంచ‌న విధాన‌మే ప్ర‌పంచాన్ని ముంచింది..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని