టిక్‌టాక్‌కు కేంద్రం 79 ప్రశ్నలు!
close

తాజా వార్తలు

Published : 10/07/2020 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌కు కేంద్రం 79 ప్రశ్నలు!

దిల్లీ: భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఆయా సంస్థలకు 79 ప్రశ్నలతో రూపొందించిన నోటీసును పంపించింది. మూడు వారాల్లోగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది. జులై 22లోపు వీటికి బదులు ఇవ్వకుంటే పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని నోటీసుల్లో పేర్కొంది.

ఇందులో ఆయా కంపెనీల కార్పొరేట్‌ మూలాలు, మాతృ సంస్థ, ఫండింగ్‌, డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి ఆయా యాప్స్‌ సమాధానం ఇచ్చాక ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ వాటిని పరిశీలిస్తుంది. అయితే, అంతకుముందే ఈ యాప్స్‌ గురించిన సమాచారాన్ని భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా వర్గాలు కేంద్రానికి అందించాయి. వచ్చిన సమాధానాలను నిఘా వర్గాల వివరాలతో సరిపోలుస్తారు. ఒకవేళ ఆ సమాచారంలో తేడాలుంటే సదరు యాప్స్‌పై చర్యలుంటాయి. ఒకవేళ సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే సమీప భవిష్యత్‌లో టిక్‌టాక్‌ సహా మిగిలిన యాప్స్‌ తమ సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నోటీసుల ద్వారా తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని