close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/07/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెరిపిద్దాం.. మోచేతుల్ని!

కొందరి మోచేతులు నల్లగా, బరకగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యని దూరం చేసుకోవాలంటే ఈ చిట్కాలు ఉపయోగపడతాయి. అవేంటంటే...

రోజూ ఉదయాన్నే లేచాక కొద్దిగా వేడి చేసిన కొబ్బరినూనెకి కాస్త బ్రౌన్‌షుగర్‌, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఆ ప్రాంతంలో రుద్దాలి.  వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి.
* రెండు చెంచాల వంటసోడాలో కొద్దిగా పాలు కలిపి అక్కడ పూతలా వేయాలి. ఆరాక కడిగేసుకుంటే సరి. ఇలా తరచూ చేస్తుంటే మోచేతులు నలుపు తగ్గుతాయి.
* రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున మెంతిపిండి, ఉలవపిండి తీసుకుని దాంట్లో అరచెక్క నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి మోచేతులకు రాసుకోవాలి. దాన్ని పావుగంటయ్యాక కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.  
* బంగాళాదుంపని స్లైసుల్లా తరిగి మోచేతులపై రుద్దాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఒకవేళ ఆ ప్రాంతంలోని చర్మం మరీ పొడిబారి బీటలు వారినట్టు అయితే బంగాళాదుంప రసంలో తేనె కలిపి రాసుకుని మర్దన చేస్తే త్వరగా పరిష్కారం దొరుకుతుంది.
* కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి రాసుకుని మోచేతుల దగ్గర మర్దన చేయాలి. కలబంద గుజ్జు చర్మాన్ని తేమగా మారుస్తుంది. నలుపుదనాన్నీ తొలగిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.