close

తాజా వార్తలు

Published : 05/07/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోషకాల మునగాకు!

వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబూ, దగ్గులాంటి ఇబ్బందుల నుంచీ బయటపడవచ్చు..
పాలకూరతో పోలిస్తే దీంట్లో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండులో కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.
* మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం సహజంగా కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
* శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంటాయి.
* మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది..  
* ఈ ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుంది.
* ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని