close

తాజా వార్తలు

Published : 05/07/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళ్లు చెదిరేలా.. అదిరే తెల్ల కోవెల!

మన భారతదేశం పేరు చెప్పగానే.. తాజ్‌మహల్‌ మన మదిలో మెదులుతుంది. ఇలాంటి ఓ నిర్మాణమే థాయ్‌లాండ్‌లోనూ ఉంది. దాని పేరే తెల్ల కోవెల (వైట్‌ టెంపుల్‌). నిజానికి దీని అసలు పేరు ‘వాట్‌ రాన్‌గ్‌ ఖున్‌’. చాలా మంది పర్యాటకులు మాత్రం ముద్దుగా వైట్‌ టెంపుల్‌ అని పిలుచుకుంటారు.

ఇది థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌ రాయ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇది ఓ బౌద్ధాలయం. ఈ చక్కటి ఆలయాన్ని చాలెర్మ్‌చాయ్‌కొసిట్పిట్‌ అనే రూపశిల్పి డిజైన్‌ చేశారు. ఈ కోవెల నిర్మాణం 1997లో ప్రారంభమైంది. ఈ బౌద్ధాలయంలో ప్రతి అంగుళమూ కళాత్మకమే. అద్దాలతో, నగిషీలతో, చక్కని విగ్రహాలతో కనువిందు చేస్తుంది. లాక్‌డౌన్‌కు ముందు వరకు థాయ్‌లాండ్‌ వెళ్లిన పర్యాటకులు చాలామంది తప్పనిసరిగా ఈ వైట్‌ టెంపుల్‌ను సందర్శించి వచ్చేవారు. ఈ ఆలయంలోకి సముద్రంపై నిర్మితమైన వంతెన మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

కుదిపేసిన భూకంపం

ఇంత చక్కటి నిర్మాణం 2014లో వచ్చిన భూకంపం వల్ల చాలా వరకు దెబ్బతింది. నిర్వాహకులు తిరిగి అతి కష్టం మీద మరమ్మతులు చేశారు. ఈ వైట్‌ టెంపుల్‌లోనే గోల్డ్‌ టెంపుల్‌ కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే.. మెయిన్‌ హాల్‌ లోపల బుద్ధుడి ప్రతిమలు, పురాతన పాత్రలతో పాటు మైకేల్‌ జాక్సన్‌, టెర్మినేటర్‌, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి, హ్యారీపోటర్‌, సూపర్‌మ్యాన్‌.. లాంటి శిల్పాలూ ఉన్నాయి. మొత్తానికి ఈ టెంపుల్‌లో అడుగు పెట్టగానే మరోలోకంలో ప్రవేశించినట్లుగా అద్భుతంగా ఉంటుందట!



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని