
తాజా వార్తలు
పొడుపు కథలు
1. ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు?
2. కాళ్లున్నా పాదాలు లేనిది?
3. మా ఇంట్లో రెండు చిలుకలు. పక్కపక్కనే ఉంటాయి. ఒకే పని చేస్తాయి కానీ ఒకదాన్ని మరోటి చూసుకోలేవు. కలుసుకోలేవు?
చెప్పుకోండి చూద్దాం
ఈ భూమి మీద ఎక్కడైనా ‘నిన్న’ అనేది ‘నేడు’ కన్నా ముందు వస్తుంది. ఒక్క చోట మాత్రం నేడు తర్వాత నిన్న వస్తుంది. అదెక్కడ?
సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.
దారేది?
కిట్టీ అనే పిల్లి.. పప్పీ అనే కుక్కపిల్ల మంచి స్నేహితులు. అవి దారి తప్పిపోయాయి. అవి కలుసుకునే మార్గం చూపించరూ!
జవాబులు:
చెప్పుకోండి చూద్దాం: డిక్షనరీలో పొడుపు కథలు: 1.గొడుగు 2.కుర్చీ 3.కళ్లు
సుడోకు
బొమ్మగీద్దాం రండి!
మీకు చక్కగా బొమ్మలు గీయడం వచ్ఛా.! ఏదైనా అంశాన్ని తీసుకొని చక్కని రంగులతో బొమ్మగీసి ‘hb.eenadu@gmail.com’ ఈ మెయిల్‌కు పంపండి.
మీరు గీసిన బొమ్మలు, మరిన్ని విశేషాలు https://epaper.eenadu.net లో ..