close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ఆలోచనలే భయపెడుతున్నాయ్‌!

నాకు 65, మావారికి 72 ఏళ్లు. మా పిల్లలిద్దరూ విదేశాల్లో ఉన్నారు. గతేడాది నాకు స్టంట్‌ వేశారు. అప్పటి నుంచి ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పిల్లలు ఫోన్‌ చేసినప్పుడల్లా జాగ్రత్తలు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే గుండె దడ పెరుగుతుంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. వైరస్‌ సోకుతుందేమోనని, గుండె జబ్బు తిరగబెడుతుందేమోనని, నాకేమైనా అయితే పిల్లలను చూడగలనా అని భయమేస్తుంది. ఇవన్నీ తలచుకుంటే దుఃఖం ఆగడం లేదు?

- ఓ సోదరి

జ: స్టంట్‌ వేయడం, పిల్లలిద్దరూ దూరంగా ఉండటం, మీకేమైనా అయితే వారిని చూడలేనేమోననే అభద్రతాభావం, భయంతో ఉన్నారు. అలాగే అందరూ జాగ్రత్తలు చెప్పడంతో ‘నాకేమైనా అవుతుందేమో... నా భర్తను ఎవరు చూసుకుంటారు?’ లాంటి ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోతున్నారు. కరోనా వల్ల జరుగుతున్న కొన్ని నష్టాలు వాస్తవమైనప్పటికీ, అవి మీకూ జరుగుతాయేమోనని భయపడటంలో అర్థం లేదు. ప్రతికూలంగా ఆలోచించడం వల్ల భయం పెరిగి.. కుంగుబాటుకు గురవుతున్నారు.

ఏం చేయాలంటే...

మొదట మీ ఆలోచనల్లో వాస్తవం ఉందో లేదో చూద్దాం. మీలా గుండెకు శస్త్రచికిత్సలు చేసుకుని ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. పెద్దవయసులో ఈ గుండె సంబంధ సమస్యలు రావడం సహజం. కాబట్టి దీన్ని పెద్ద విషయంగా పరిగణించకూడదు. గతేడాదే స్టంట్‌ వేశారు కాబట్టి ‘నా గుండె బాగా పనిచేస్తుంది’ అని మీకు మీరే పాజిటివ్‌ సలహాలు ఇచ్చుకోండి.

ఇక ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తే సరి. ఇమ్యూనిటీ పెరగడానికి రోజూ వ్యాయామం, ధ్యానం, యోగా లాంటివి చేయడం, పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. వంటా, పుస్తకాలు, మీవారితో కాసేపు ముచ్చట్లు.. ఇలా మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోండి. విదేశాల్లో ఉన్న మీ బిడ్డలను ఫోన్‌లో పలకరించండి. ఆ సమయంలో కరోనా గురించి కాకుండా ఇతర సంతోషకరమైన విషయాలు పంచుకోండి. ఇలా చేస్తే మీలోని ఆందోళనా, కుంగుబాటు తగ్గుతాయి దాంతో ప్రతికూల ఆలోచనలు రావు. అప్పుడే మీకు భయం, దుఃఖం, కుంగుబాటు తగ్గిపోతాయి. చివరగా వైరస్‌ రాకముందే దాని గురించి ఆందోళన చెందొద్ధు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంత చేసినా దుఃఖం తగ్గట్లేదంటే...ఓసారి మానసిక నిపుణులను కలవండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.