close

తాజా వార్తలు

ఒక రోజు.. మూడు ప్రాణాలు..!

మనస్తాపంతో ఇద్దరు..
మద్యానికి మరొకరు..!

ఇద్దరు ఆటోడ్రైవర్లు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడి తమ ప్రాణాలు తీసుకున్నారు. ఓ ఒప్పంద కార్మికురాలు  ఉద్యోగంపై ఆందోళనతో కార్యాలయంలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విషాదం నింపిన ఈ సంఘటనలు బుధవారం చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీకి చెందిన పాసి వెంకటదుర్గారావు(30)-వరలక్ష్మి దంపతులు బ్లాక్‌ నంబరు 94లో నివాసం ఉంటున్నారు. వారికి 9 ఏళ్ల కిందట వివాహమైంది. ఆయన ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల కిందట భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి పిల్లలను తీసుకొని వరలక్ష్మి జోజినగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో మాట్లాడుకొని మళ్లీ కాపురానికి వచ్చింది. సంకా‌్రంతి పండగకు మళ్లీ పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. భార్య కాపురానికి రావడం లేదనే బాధతో ఆయన మద్యంకు అలవాటు పడి రోజూ బాధపడుతుండేవాడు. 21వ తేదీ రాత్రి తల్లి కుమారితో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. 22వ తేదీన ఉదయం తల్లి తన కుమారుడికి అల్పాహారం తీసుకొని ఆయన ఇంటికి వెళ్లింది. అయితే తలుపులు లోపల గడియపెట్టి ఉన్నాయి. దీంతో ఆమె పక్కవారి సాయంతో తలపులు గట్టిగా నెట్టగా గడియ ఊడి వచ్చింది. వంట గదిలో ఆయన ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆమె స్థానికుల సాయంతో కొడుకును కిందకు దింపారు. అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. భార్య కాపురానికి రాదనే ఆందోళనతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని మృతుని తల్లి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. శవపంచనామా అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రియదర్శిని కాన్వెంట్‌ వీధిలో....
పీతల గంగాదేవి- దుర్గాప్రసాద్‌ దంపతులు నగరంలోని 30వ డివిజన్‌ ప్రియదర్శిని కాన్వెంట్‌ వీధి కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 21వ తేదీన ఆటోకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లి వద్ద రూ.1000లు తీసుకొని వెళ్లి పూటుగా మద్యం తాగి వచ్చి ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద పడుకున్నాడు. అతనిని భార్య చూసి రోడ్డు మీద పడుకున్నావేంటని ప్రశ్నించింది. లేచి ఇంటి లోపలకు వెళ్లి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న తల్లింటికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆయన ఇంట్లో గదిలో చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. చుట్టు పక్కల వారిని పిలవగా వారు వచ్చి చూసేసరికి అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకొని శవపంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.