close

తాజా వార్తలు

Published : 30/03/2020 06:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసన్నా.. నీ మనసు వెన్న..

స్పృహలేని వ్యక్తికి సపర్యలు
స్నానం చేయించి, ఆహారం అందించిన సిబ్బంది

నిజాంపేట, న్యూస్‌టుడే: రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తికి  బాచుపల్లి పోలీసులు సపర్యలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మెదక్‌ జిల్లా ఖాజీపల్లికి చెందిన శ్రీశైలం (45) హైదరాబాద్‌కు వచ్చి కాపాలదారుడిగా పనిచేస్తున్నాడు. వారం క్రితం తప్పిపోయి బాచుపల్లికి చేరుకున్నాడు. మతిస్థిమితం కోల్పోయి రేణుకా ఎల్లమ్మకాలనీలో అచేతనంగా పడి ఉన్న అతడిని స్థానికులు గుర్తించి బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ పి.జగదీశ్వర్‌, కార్పొరేటర్‌ ఆగం పాండు  అక్కడికి చేరుకొని బాధితుడికి స్నానం చేయించారు. మంచి దుస్తులు తొడిగించి అన్నం పెట్టించడంతో కొంత స్పృహలోకి వచ్చాడు. కుటుంబీకులకు సమాచారం అందించి బంధువులకు అప్పగించారు.

దివ్యాంగుడి చేరదీత:  మియాపూర్‌లోని గుడిసెల్లో ఉండే హన్మంతు దివ్యాంగుడు. మద్యానికి బానిసైన అతను బాచుపల్లి పరిసరాల్లో తిరుగుతూ స్పృహ లేకుండా పడి ఉండగా పోలీసులు అతడిని చేరదీసి అన్నపానీయాలు అందించిన అనంతరం ఆటోలో ఇంటికి తరలించారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని