close
Array ( ) 1

తాజా వార్తలు

బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఊరట

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బీమా కంపెనీలకు నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఊరటనిచ్చింది. 2020-21 సంవత్సరానికి రీఇన్సూరెన్స్‌ పతకాలను సమర్పించడానికి సడలింపులను ప్రకటించింది. కొన్ని నిబంధనలపై ఉన్న గడువుల విషయంలోని ఐఆర్‌డీఐఏ(రీ ఇన్సూరెన్స్‌) నిబంధనలు, 2018లోని మార్గదర్శకాలను సడలించారు. బీమా కంపెనీల కార్యకలాపాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 30, 2020 కల్లా బోర్డు ఆమోదించిన తుది రీ ఇన్సూరెన్స్‌ ప్రణాళికలను సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా దానిని 31 మే, 2020 వరకు పొడిగించారు.
 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.