స్నేహాన్ని చిదిమిన మృత్యువు
close

తాజా వార్తలు

Published : 03/07/2020 06:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్నేహాన్ని చిదిమిన మృత్యువు

కారును ఢీకొన్న కంటెయినర్‌
నలుగురు మిత్రుల మృతి

యడ్లపాడు, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదం నలుగురు స్నేహితులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నరసరావుపేటకు చెందిన మేడసాని వెంకట శ్రీచందు, వింజమూరి హరికృష్ణ, షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌, రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి అత్తలూరి బలరాం స్నేహితులు. వ్యక్తిగత పనిపై నలుగురూ బుధవారం రాత్రి కారులో నరసరావుపేట నుంచి విజయవాడ బయలుదేరారు. తిమ్మాపురం వద్ద గుంటూరు వైపు నుంచి వస్తున్న కంటెయినర్‌ లారీ అదుపు తప్పి డివైడర్‌ పైకి ఎక్కి అవతల వైపు వెళ్తున్న కారును ఎదురుగా ఢీకొంది. ఆ ధాటికి కారు పూర్తిగా దెబ్బతిన్నది. బలరాం (27), హరికృష్ణ (26) అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట శ్రీచందు (27), ఫిరోజ్‌ అహ్మద్‌ (26) చనిపోయారు.  లారీడ్రైవర్‌ పరారయ్యాడు. అతనిపై కేసు నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని