
తాజా వార్తలు
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్
యాదగిరిగుట్ట పట్టణం: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారినపడ్డారు. నాలుగు రోజుల కిందట ఆమె స్వల్ప అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ వచ్చినట్లు శుక్రవారం ధ్రువీకరించడంతో ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితం రావాల్సి ఉంది. ఎమ్మెల్యే సునీత శుక్రవారం రాత్రి చరవాణిలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కొవిడ్-19 వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడంతో తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
Tags :