అత్తింటి వేధింపులు.. ఆపై కరోనా
close

తాజా వార్తలు

Published : 06/07/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్తింటి వేధింపులు.. ఆపై కరోనా

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

నెల్లూరు (వీఆర్సీ సెంటరు): పిల్లలు పుట్టలేదని.. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వేధింపులు ఒకవైపు.. మరోవైపు కరోనా సోకడంతో నిరాదరణకు గురైన ఓ యువతి శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతికి సమీప బంధువుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు మనుమసిద్ధి నగర్‌లో ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. ఈ కారణంతో కొంతకాలంగా అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ఆమె సమీప బంధువులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెకు కూడా  పరీక్షలు చేయించగా పాజిటివ్‌ అని తేలడంతో అత్తింటి వారి నిరాదరణకు గురైంది. శనివారం భర్త, కుటుంబ సభ్యులు కావలి వెళ్లగా.. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి మనస్తాపంతో పురుగులమందు తాగింది. కావలికి వెళ్లిన మృతురాలి భర్త పలుమార్లు ఆమెకు ఫోన్‌చేసినా ఎత్తకపోవడంతో  హుటాహుటిన నెల్లూరుకు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఆమె మృతి చెందింది. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని